
ఈ నెల 15వ తారీఖున వరంగల్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్లను కరీంనగర్ కు తిరిగి తీసుకొస్తున్నారట.. అలాగే విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఉన్న ఆయా జిల్లాల ఎడిషన్లను కూడా డిసెంబర్ లోపు ఆయా జిల్లాలకు తిరిగి తీసుకొచ్చేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి..
సాక్షిలో కొత్తగా వచ్చిన పెద్దాయన ఐడియా ఈ ఎడిషన్ల ఎత్తివేత షూరు అయ్యింది. వరంగల్, హైదరాబాద్ కు తెలంగాణ ఎడిషన్లు, విశాఖ, విజయవాడ, తిరుపతి కి ఆంధ్ర ఎడిషన్లు తరలిపోయాయి. వందలమంది జర్నలిస్టులు ఈ మార్పుకు ఉద్యోగాలు మానే సి వేరే బతుకుదెరువు చూసుకున్నారు. ఇప్పుడు మ్యాన్ పవర్ కొరతతో సతమతమవుతున్న సాక్షి దిద్దుబాటు చర్యటు చేపట్టింది..
తరలిస్తే ఉన్నది పోయింది.. ఉంచుకున్నళ్లో పోయేసరికి మైండ్ బ్లాక్ అయి మళ్లీ జిల్లా ఎడిషన్లకు తరలిస్తున్నారు. దీనికి గాను ఒక్కో జిల్లా ఎడిషన్ కు దాదాపు 10 లక్షలు మళ్లీ ఖర్చుపెడుతున్నారు.
చెత్త ఐడియాలతో సాక్షిన భ్రష్టు పట్టించిన పెద్దలు ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నా.. అందులో తిరిగి చేరడానికి మాత్రం జర్నలిస్టులు భయపడుతున్నారట.. ఉద్యోగ భద్రతలేని ఉద్యోగాలు మాకొద్దు అంటున్నారట.. దీంతో సాక్షికి ఇప్పుడు మనశ్శాంతి కరువైంది..