Breaking News

15న కరీంనగర్ లో టాలెంట్ హంట్!

15న కరీంనగర్ లో టాలెంట్ హంట్!

దర్శకత్వం నటన, రచన లో ప్రతిభ గల యువతి, యువకులకు అవకాశం కల్పించేందుకు కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఈనెల 15న టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్లు ఫ్రిజ్ సినిమా దర్శకులు శ్రీధర్ కుడిక్యాల, ఈ టీవీ 9 డాట్ నెట్ వ్యవస్ధాపకులు అయిలు రమేష్ లు తెలిపారు. ఈ టీవీ 9 డాట్ నెట్ నిర్మించనున్న లఘు చిత్రాల్లో ఎంపికైన దర్శకులకు, నటినటులకు, గాయకులకు అవకాశం కల్పించనున్నట్లు వారు తెలిపారు. కధా రచయితలు తమ స్ట్ర్రిప్ట్ లను వెంట తెచ్చుకోవాలని ఎంపికైనా కధలను లఘు చిత్రాలుగా నిర్మిస్తామని అయిలు రమేష్ తెలిపారు. కామెడి స్కిట్స్, లవ్ స్టోరీలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తామని ఫ్రిజ్ సినిమా దర్శకులు శ్రీధర్ కుడిక్యాల తెలిపారు. తెలంగాణ ప్రాంత కళాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నామని ఆసక్తి గల వారు 9493005354, 9440002999 నంబర్లను సంప్రదించాలని వారు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *