Breaking News

15న ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల సమావేశం

ailu ramesh copy

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసే జర్నలిస్టులకు, సబ్ ఎడిటర్లకు ఉన్న గుర్తింపు ఆన్ లైన్ వెబ్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సబ్ ఎడిటర్లకు లేదు.. దీంతో ప్రభుత్వం కల్పించే అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల విషయంలో ఆన్ లైన్ వెబ్ మీడియా సిబ్బందికి అన్యాయం జరుగుతోంది. అందుకోసం మనమందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. సంఘంగా ఏర్పడి మన హక్కుల కోసం పోరాడాలి. లేకపోతే.. మనం వెట్టి చాకిరీలో మగ్గుతున్నట్టే.. అందుకోసమే ఒక వేదిక ఏర్పాటు చేసి మన సమస్యలను చర్చించాలని నిర్ణయించాం.

ఆన్ లైన్ వెబ్ మీడియాలోని జర్నలిస్టులు, సబ్ ఎడిటర్ల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 15న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్ అయిలు రమేశ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ సీనియర్ నాయకులు కే.శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ వెబ్ మీడియాలో పనిచేసే మిత్రులందరూ హాజరై విజయవంతం చేయాలని అయిలు రమేశ్ కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *