కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): విద్య, పేదల సంక్షేమంతో పాటు ప్రభుత్వం వైద్య రంగానికి కూడా ప్రాధన్యమిస్తుందని రాష్ర్ట ఆర్థిక, పౌర సరఫరాల శాఖా మాత్యులు ఈటెల రాజేందర్ అన్నారు. రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైద్య ఆరోగ్య శాఖ భవన సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా భవన నిర్మాణాలు చేయడానికి అంచనా కన్నా ఎక్కువ నిధులు మంజూరు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రులలో కావలసిన మౌళిక వసతులు, సదుపాయాలకు నిధుల వివరాలు సమర్పిస్తే నెల రోజులలో నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. లక్షలు వెచ్చింది పైవేటు ఆసుత్రులలో వైద్యం చేయించుకుంటున్నారని ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం కల్పించేలా ప్రతి డాక్టర్ కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ మానవీయ కోణంతో ఆలోచించి బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా అలీం, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సుజాత తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related posts
Leave a Reply

Leave a Reply
