13న నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక

మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి గుండెపోటుతో మరణించారు. ఈయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు..

దీంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఉప ఎన్నిక నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈనెల 20 న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.. 27వ తేదీలోపు నామినేషన్ల గడువు విధించారు. 30వ తేదీ వరకు ఉపసంహరణల గడువు విధించారు. ఎన్నికలు ఫిబ్రవరి 13న నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు 16న చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *