
గూగుల్ కంపెనీని మొన్న కొత్తగా పునర్వ్యస్తీకరించారు. సుందర్ పిచ్చైయ్ ను సీఈవోగా చేశారు. అంతేకాదు గూగుల్ అనుబంధ సంస్థలన్నింటిని కలిపిసే ఆ డొమైన్ లను అమ్మకానికి పెట్టేశారు.. పొరపాటున గూగుల్ . కామ్ డొమైన్ కూడా సేల్ కు వచ్చింది..
దీంతో డొమైన్ ల కోసం చూస్తున్న భారతీయుడు సన్మయ్ వేద్ వెంటనే గూగుల్.కామ్ ను కొనేశాడు. దాని విలువ కేవలం 12 డాలర్లే (800 రూపాయలు). కార్డు ద్వారా మొత్తం చెల్లించాడు. దీంతో గూగుల్.కామ్ సొంతం అయినట్టు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది.. యాడ్స్, నోటిఫికేషన్లు కూడా వచ్చాయట… దీంతో ఉబ్బితబ్బియ్యైన సన్మయ్ తేరుకునేలోపే ఆశలు ఆవిరయ్యాయి.. గూగుల్ నుంచి తప్పు జరిగిందని ఆ డొమైన్ ను తిరిగి తీసేసుకున్నారు. దీంతో కొద్దిసేపైనా గూగుల్ ఓనరైనందుకు సన్మయ్ సోషల్ మీడియాలో ఆనందపడుతున్నాడట..