11న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన

Rahul-Gandhi1-765x510

హైదరాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 11న రాహుల్ సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా నిర్మల్ వెళ్తారు. ఆ రాత్రి నిర్మల్ లోనే బసచేసి 12న ఉదయం నిర్మల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. వడ్యాల్, రాచాపూర్, పట్పల్లి, లక్ష్మన్ చాందా, కొరిటికల్ లలో రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం పట్పల్లిలో రాహుల్ లంచ్ చేస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. 13న ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *