Breaking News

బస్తీ వాసుల కోసం G+2 పద్దతిలో ఇండ్ల నిర్మాణం…

sanyh nagar

సనత్ నగర్, కూకట్ పల్లి నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఇందిరా నగర్ బస్తీని  ఉదయం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు సందర్శించారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తూ ముఖ్యమంత్రి ఇందిరా నగర్ బస్తీ వద్ద ఆగారు. ఇరుకైన రహదారికి ఇరువైపులా వున్న ఇండ్లను పరిశీలించారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్న వారి జీవన స్థితిగతులు తెలుసుకున్నారు. కూలీ పనులు చేసుకుంటూ బతికే వారు ఇరుకైన ఇండ్లలో, కనీస వసతులు లేకుండా జీవిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. నగరంలో ఇలాంటి బస్తీల్లో దాదాపు రెండు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. వారందరికి దశల వారీగా టు బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. ఇందిరా నగర్ బస్తీ వాసుల కోసం G+2 పద్దతిలో ఇండ్లు నిర్మిస్తామన్నారు. ప్రతిపాదనలు, లేఅవుట్ సిద్దం చేయాలని జిహెచ్ఎంసి అధికారులను సిఎం ఆదేశించారు. మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జిహెచ్ఎంసి కమీషనర్ సోమేష్ కుమార్, తదితరులు సిఎం వెంట వున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *