10 నెలల పాలనపై కేసీఆర్ సమీక్ష

తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పడి ఈరోజుకి 10 నెలలు.. దీంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై గురువారం సమీక్షించారు. సచివాలయంలో మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా.. మన పథకాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారా అనే విషయంతో చర్చించారు. పథకాలు బాగున్నా క్షేత్రస్థాయికి తీసుకెళ్లలేక.. అధికారుల తప్పిదాల వల్ల పథకాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు.

అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ఆయన సమీక్షించారు. ఇక త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలపై కేసీఆర్ సమీక్షించారు. ఎన్నికల వ్యూహంపై సమాలోచనలు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *