10వ తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర్రంలోనే అగ్రస్ధానంలో నిలపాలి

కరీంనగర్: వచ్చే 10వ, తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్ర్రంలోనే ప్రధమ స్ధానంలో నిలపాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం నగరంలోని ఓల్డు హైస్కూల్ లో 10వ తరగతి విద్యార్ధులకు ‘‘సరస్వతి ప్రసాదం’’ప్రారంభం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హజరు అయ్యారు. ఈ సందర్భ్గా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా చైతన్య వంతమైన జిల్లా అని, అన్ని రంగాల్లో ముందున్నదని, కాని విద్యా పరంగా వెనుకబడి ఉందని అన్నారు. గత సంవత్సరం 10వ తరగతిలో 86 శాతం ఉత్తీర్ణత సాధించిందని, మహబూబ్ నగర్ జిల్లా కన్నా తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని తెలిపారు. అందుకే ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని తెలిపారు. ఉదయం సాయంత్రం అదనపు క్లాస్ లు నిర్వహిస్తున్నందున విద్యార్ధులకు సరస్వతి ప్రసాదం పేరుతో అల్పాహరం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలకు దత్తత అధికారులను నియమించామని తెలిపారు. వచ్చే 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు 10 జిపిఎ మార్కులు సాధించిన వారికి రాష్ట్ర్ర మంత్రి, పార్లమెంటు శాసన మండలి, శాసన సభ్యులతో సన్మానిస్తామని అన్నారు. 10 జిపిఎమార్కులు సాధించాలని కృషి, సంకల్పం ఉంటే తప్పక సాధిస్తారని అన్నారు. అనంతరం కలెక్టర్ సైన్సు మ్యూజియంను పరిశీలించారు. నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ విద్యార్ధుల భవిష్యత్తుకు తొలి మెట్టు 10వ తరగతి పరీక్షలని అన్నారు. పేదవారి బడి అంటే ప్రభుత్వ పాఠశాలలని, ఇందులో చదివిన వారు ఐఎఎస్, ఐపిఎస్ లు అయ్యారని, పేదరికం విద్యకు అడ్డు కాదని అన్నారు. పేపర్ అమ్మిన అబ్బుల్ కలాం రాష్ట్ర్రపతి, చాయ్ అమ్మిన నరేంద్ర మోది ప్రధాన మంత్రి అయ్యారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్ధులకు బాగా చదివి 10వ తరగతిలో అందరు పాసుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కమీషనర్ శశాంక్, జిల్లా వాద్యాధికారి రాజీవ్ మండల విద్యాధికారి, బుక్కారెడ్డి, తహసీల్దార్ జయచందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts