10వేల టీచర్ పోస్టులకు ఓకే..

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొత్తకబురునందించింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 10వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై రేపోమాపో ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు. టెట్ పూర్తికాగానే డీఎస్సీ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పారు. త్వరలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎక్కడా హామీ ఇవ్వలేదని చెప్పారు. మేం హామీ ఇచ్చిన లక్ష ఉద్యోగాలను ఈ ఐదేళ్లలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వడం ప్రపంచంలోని ఏ ప్రభుత్వం వల్ల కాదన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రగతి పథాన వెళుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాని మోడీయే మెచ్చుకున్నారని సభకు తెలిపారు.. 2.67 లక్షల రెండు పడకగదుల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు ప్రగతి సాధించాలంటే అప్పులు, వ్యయాలు తప్పవని కేసీఆర్ అన్నారు.. ఇప్పుడున్న కరువు పరిస్థితులు ప్రాజెక్టులు కడితే ఉండవని హామీ ఇచ్చారు. తమిళనాడు తరమాలో ఎస్టీలు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇక జిల్లాల పునర్విభజన తర్వాతే కొత్తగా తెలంగాణ లో జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొత్త జిల్లాల విభజన కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై నే ఉంటుంది. ఏప్రిల్ నాటికి విద్యార్థులకు మొత్తం విద్యా బోధన రుసుములు చెల్లిస్తామని ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *