Breaking News

10లక్షల సంపాదన దాటితే సబ్సిడీ గ్యాస్ రద్దు

modi_90

మీ ఆదాయం నెలకు 10 లక్షలు దాటితే ఇక మీకు సబ్సిడీ గ్యాస్ రద్దు అయినట్టే .. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బండను పేదలకు చేర్చాలనే కేంద్ర నిర్ణయం మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని అందులో భాగంగా 10 లక్షలు సంపాదించేవారిని ఇక నుంచి పేదలకు కాకుండా ఉన్నత వర్గంగా గుర్తించి వారికి గ్యాస్ సబ్సిడీని రద్దు చేయాలని నిర్ణయించింది..

ప్రస్తుతం అందరూ ఆదాయంతో సంబంధం లేకుండా పేద, ధనిక వర్గాలు ఎవరైనా 14.2 కిలోల ఇంట్లో వాడే గ్యాస్ ను కేంద్రం సబ్సిడీ ద్వారా 419.26 రూపాయలకు అందిస్తోంది.. ఇలా నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 అందరూ తీసుకోవచ్చు.. కానీ రోజురోజుకు చమురు, గ్యాస్ కొరత డిమాండ్ పెరుగుతుండడం.. కేంద్రం పై సబ్సిడీ భారం పడుతుండడంతో మోడీ సర్కారు పేదలకు గ్యాస్ సబ్సిడీని ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మార్కెట్ ధర ప్రకారం నాన్ సబ్సిడీ సిలిండర్ ప్రస్తుతం రూ.608గా ఉంది. పది లక్షల ఇన్ కం దాటిన వారందరూ ఇప్పుడు ఈ 608 పెద్ద గ్యాస్ సిలిండర్లను తీసుకోవాల్సిందే..

మోడీ అదును చూసి వాతలు పెడుతున్నాడు. సంక్షేమ పథకాల మాటున ప్రైవేటీకరణను, పారిశ్రామిక వేత్తలకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటోంది. గ్యాస్ సబ్సిడీని 10 లక్షల పైన ఉన్న వాళ్లకు దూరం చేయడం బాగానే ఉన్నా ఇవన్నీ ప్రైవేటీకరణ వైపు వేసే అడుగులే అన్న సందేహం కలుగకమానదు.. పేదలు కూడా ఇక రానున్న రోజుల్లో గ్యాస్ ను మొత్తం ధరకే కొనిపించేలా మోడీ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *