Breaking News

10న పుష్కర ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రతినిధి బృందం పర్యటన

katakam mrutyunjayam

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనంగా నిర్వహిస్తామని ప్రగల్బాలు పలికిన తెలంగాణ ప్రభుత్వం పుష్కర నిర్వహణ ఏర్పాట్లలో మాత్రం ఘోరంగా విఫలమైందని ఒక ప్రకటనలో ఆరోపించారు కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం.. బుధవారం ప్రకటనను విలేకరులకు విడుదల చేశారు. పనులలో అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నా.. అధికార యంత్రాంగం స్పందించడం లేదని మండిపడ్డారు. యాత్రికులకు కనీసం సౌకర్యాలు ఇంకా పూర్తికాలేదని.. ప్రభుత్వం, అధికారులు ఇంకా గోదావరి పుష్కర పనులు పూర్తిచేయకపోవడం దారుణమన్నారు.

కాగా కాంగ్రెస్ పార్టీ బృందం ఈనెల 10న పుష్కర ఘాట్ పనులను పర్యవేక్షించేందుకు బయలుదేరుతుందని.. ుదయం 6 గంటలకు కరీంనగర్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర కరీంనగర్ నుంచి ధర్మపురి, కాళేశ్వరంనకు చేరుకుంటుందని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *