10కిలోల కణతి తొలగింపు

జగిత్యాలలో ఓ రైతుకు అరుదైన ఆపరేషన్ జరిగింది. హైదరాబాద్ సన్ షైన్ ఆస్పత్రి వైద్యుల సాయంతో దాదాపు రెండు గంటలపాటు శ్రమించి రైతు చెంప కు ఉన్న ఈ కణతిని తీసేశారు. ప్రపంచంలోనే చాలా అరుదైన , ప్రాణాంతక ఆపరేషన్ ను వారు దిగ్విజయంగా చేశారు.

జగిత్యాలకు చెందిన ఓ నిరుపేద రైతుకు మెడ పక్కన చిన్నగా ప్రారంభమైన కణతి పది కిలోల వరకు పెరిగి రైతు బతుకును దుర్భరం చేసింది. జగిత్యాల, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిల్లో చూపిస్తే లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది. ఆపరేషన్ రిస్క్ అయినా డబ్బులు సమకూరిస్తే చేస్తాం అని చెప్పారట.. అంత డబ్బులు లేక రైతు ఆపరేషన్ చేయించుకోలేదు.

రైతు దీనావస్థను చూసిన జగిత్యాల డాక్టర్లు స్పందించి రైతుకు ఉచితంగా ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు. హైదరాబాద్ లోని సన్ షైన్ వైద్యులతో మాట్లాడి ఆదివారం ఆపరేషన్ ను ఉచితం గా చేశారు. రైతుకు పునర్జన్మ నిచ్చారు. దాదాపు 10 కిలోలు ఉన్న కణతిని వేరు చేసే క్లిష్టమైన ఆపరేషన్ చేసి రైతును బతికించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *