1 నుంచి కేబుల్ టీవీ బంద్ అయినట్టే..?

కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. జనవరి 1 2016 నుంచి దేశంలోని ప్రధాన 110-115 పట్టణాలు, నగరాలలో డిజిటల్ ప్రసారాలను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి 1 నుంచి కేబుల్ టీవీ వినియోగదారులు ఎవరైతే సెట్ ఆప్ బాక్స్ తీసుకోరో వారికి కేబుల్ టీవీ ప్రసారాలు జరగవు.. అంటే డిష్ రాదన్న మాట..

కేబుల్ టీవీ డిజిటైలేషన్ లో భాగంగా ప్రతి టీవీకి సెట్ అప్ బాక్స్ అమర్చుకోవాలి. ఇది రూ. 1100 నుంచి 1500లోపు ధరలున్నాయి.. ఇవి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారమే.. ఎందుకంటే పేదలు, మధ్యతరగతి వారు ఏ పొద్దున్నో పనులకు వెళితే తిరిగి రాత్రికి వస్తారు.. మహా అయితే వారు చూసేది రాత్రి 7 నుంచి 10 గంటల వరకే.. మిగతా ఇంట్లో ఆడవాళ్లు చూస్తారు. దీంతో ఇప్పుడు సెట్ అప్ బాక్స్ కు 1500 పెట్టే ధైర్యం వారు చేయడం లేదు.. దీంతో 1 నుంచి డిష్ ఉన్నవారికి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతాయి.. అసలు కేంద్ర ప్రభుత్వం పథకం అమలు ద్వారా క్వాలిటీ ప్రసారాలు అందుతాయని ఊదరగొడుతున్నా.. సెట్ బాక్స్ లు ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అందరికీ మేలు జరుగుతుందని కదా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు..

కాగా సెట్ అప్ బాక్స్ ల వెనుక పెద్ద లాభమే ఉంది.. ఇన్నాళ్లు కేబుల్ టీవీల పేర దోచుకున్న సిటీ కేబుల్ ల ఆగడాలు ఇక చెల్లవు.. సెట్ అప్ బాక్స్ ఉంటే ఎంత మంది వినియోగదారులున్నారో.. ఎంత వసూలు చేయాలో కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోతుంది. దాని ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితంగా పన్ను అందుతుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లాభం తప్పితే సామాన్యులకు ఎలాంటి లాభం లేదు.. ఇన్నాళ్లు దోచుకున్న సిటీకేబుల్ వారికి కష్టం పక్కాగా లెక్కలుంటాయి కాబట్టి.. కేంద్రం డిజిటైలేషన్ పేరుతో చివరకు పన్ను వసూలే కీరోల్ అన్నది తెలియక జనం డిజిటల్ బాక్స్ లు అంటూ సంబరపడుతుండడం శోచనీయం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *