నగదు రహిత లావాదేవీల వ్యాపారస్ధులకు కలెక్టర్ పిలుపు

కరీంనగర్: జిల్లాలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించుటకు వ్యాపారస్ధులు ముందుకు రావాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 8నుండి పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారస్ధులు, ప్రజలు ఇబ్బందులు పడుచున్నందున, ఈ సమస్య పరిష్కారానికి నగదు రహిత లావాదేవీలు ఒక్కటి మార్గమని అన్నారు. కేంద్ర రాష్ట్ర్ర ప్రభుత్వాలు కూడ డిజిటల్ చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ముందుగా వ్యాపారస్ధులు నగదు రహిత లావాదేవీల నిర్వహణకు బ్యాంకు వద్ద ఎన్నో రకాల యాప్ లున్నవని అన్నారు. మీకు నచ్చిన పద్దతిలో జరుపుకోవచ్చని తెలిపారు. వ్యాపారస్ధులు బ్యాంకుల ధరఖాస్తు చేసుకున్న వారం పది రోజుల్లో పాస్ మిషన్లు అందజేస్తారని తెలిపారు.
ఇంటర్ నెట్ లేకపోయినా సాధారణ ఫోన్ల ద్వారా కూడా డబ్బు పంపవచ్చునని, తీసుకోవచ్చునని తెలిపారు. ఈ బ్యాంకింగ్ కు సంబంధించి బ్యాంకర్లు ఎల్.సి.డి. ప్రొజెక్టర్ ద్వారా వర్తకులకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లా స్ధాయిలో, మండల స్ధాయిలో, గ్రామ స్ధాయిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాలలోని సాధారణ ప్రజలు కూడా కార్డులు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తామని అన్నారు.
ముందుగా జిల్లాలో 50శాతం ఖాతా దారులు తమ ఆధార్ నెంబర్ ఖాతాలకు అనుసంధానం చేసుకోలేదని త్వరలో వంద శాతం చేయిస్తామని అన్నారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ డిప్యూటి కమీసనర్ గాంధీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎమ్ శోభ, ఎస్.బి.హెచ్ అంధ్రాబ్యాంక్ అధికారులు, కిరాణా మర్చంట్, సూపర్ మార్కెట్, ఇటుక బట్టీలు, ఆయిల్ మర్చంట్స్, రెడిమేడ్ బట్టల దుకాణాల, ఐఎమ్ఎ, మెడికల్ అసోసియేషన్, హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.