వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో 2100 పోస్టుల భర్తీ

 

 

మరిన్ని మాతా శిశు వైద్యశాలల కోసం ప్రణాళికలు

ఆశా వర్కర్ల కు మరింత శిక్షణ

త్వరలోనే బీబీ నగర్ నిమ్స్ లో ఐపీ

అంటువ్యాధుల మీద అప్రమత్తం

ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష

వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, సిబ్బంది కొరత నివారణకు నడుం బిగించింది తెలంగాణ ప్రభుత్వం. tspsc ద్వారా నియామకాలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ప్రయత్నం మొదలు పెట్టారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. 2100 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడానికి అనుమతించారు. అలాగే, కేసీఆర్ కిట్ల పథకానికి ఉన్న డిమాండ్ రీత్యా, మరిన్ని మాతా శిశు వైద్యశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక ఆశా వర్కర్ల ప్రోత్సహకలు వారికి సమయానికి అందేలా చూడాలని చెబుతూనే, వారికి మరింత శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిమ్స్ లో త్వరలో ఐపీ ఏర్పాటు, వర్షాలు కురుస్తున్నందున  అంటువ్యాధులు మీద అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు ఆదేశించారు మంత్రి. హైద్రాబాద్ సెక్రటేరియట్ డి బ్లాక్ లోని తన ఛాంబర్ లో వివిధ అంశాల మీద మంత్రి ఉన్నతాధికారులతో మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సమీక్షించారు.

ఈ సందర్బంగా మంత్రి లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ పలు అంశాలు, వివిధ విభాగాల మీద వివరంగా సమీక్షించారు.

కాంట్రాక్టు పద్ధతిలో 2100 పోస్టుల భర్తీ

ఇప్పటికే రెండు వేల పై చిలుక పోస్టుల భర్తీ వ్యవహారాన్ని tspsc కి అప్పగించామన్నారు. అయితే పలు సాంకేతిక, పరిపాలన పరమైన సమస్యల కారణంగా ఆయా పోస్టుల భర్తీకి మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అయితే, ఈ లోగా హాస్పిటల్స్ లో సిబ్బంది కొరతను అధిగమించడానికి 2100 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని మంత్రి అధికారులకు సూచించారు. వైద్య విద్య, వైద్య విధాన పరిషత్, వైద్య సంచాలకుల పరిధిలో ఆయా పోస్టులను భర్తీ చేయలని ఆదేశించారు.

మరిన్ని మాతా శిశు వైద్యశాలల కోసం ప్రణాళికలు

కేసీఆర్ కిట్ల పథకం విజయవంతంగా అమలు జరుగుతున్నదని, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగిందని మంత్రి చెప్పారు. కొత్తగా రాష్ట్రంలో 5 మాట శిశు దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో 14 హాస్పిటల్స్ ఏర్పాటుకు అనువైన, అవసరమైన ప్రదేశాలని గుర్తించమన్నారు. అయినప్పటి కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న దవాఖానాలు సరిపోవడం లేదని మంత్రి చెప్పారు. అందుకని మరిన్ని కొత్త MCH లను ఏర్పాటు చేయడానికి అనువైన హాస్పిటల్స్ ని వెతకాలని, తగు సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులని మంత్రి ఆదేశించారు. కేసీఆర్ కిట్ల ప్రత్యేక అధికారి సత్యనారాయణ రెడ్డి, TSMSIDC ఎండి వేణుగోపాల్, చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్ రెడ్డి లను కలిసి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సాధ్యమైనంత వేగంగా వాటి పని ప్రారంభించాలని మంత్రి చెప్పారు.

ఆశా వర్కర్ల కు మరింత శిక్షణ

ఆశా వర్కర్ల కి ప్రోత్సాహకాలు సమయానికి అందేలా చూడాలని అలాగే, వారికి మరింత శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయ పడ్డారు. పల్లెల్లోనూ మధుమేహం, బిపి వంటి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని అలాంటి వారికి ప్రాథమిక పరీక్షలు చేసి, మందులు ఇచ్చే స్థాయి శిక్షణ ఆశా లకు ఇస్తే బాగుంటుందని మంత్ర లక్ష్మారెడ్డి చెప్పారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చూడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారికి సూచించారు.

త్వరలోనే బీబీ నగర్ నిమ్స్ లో ఐపీ

బీబీ నగర్ నిమ్స్ లో ఓపి ప్రారంభించి చాలా రోజులు అవుతున్నా, ఐపీ ప్రారంభంలో జాప్యాన్ని తొలగించాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం ప్రగతిలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి, కొద్దీ రోజుల్లోనే ఐపీ సేవలు ప్రారంభం అయ్యే విధంగా చూడాలని నిమ్స్ డైరెక్టుగా డాక్టర్ మనోహర్ ని మంత్రి ఆదేశించారు.

 

అంటువ్యాధుల మీద అప్రమత్తం

 

ప్రస్తుతం రాష్ట్రంలో తుఫాన్ ఉన్నందున అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి నివారణ కు అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. మందులు అందుబాటులో ఉంచాలని, మిగతా శాఖలతో సమన్వయం చేసుకుపోవలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. నగరంలో ఏర్పాటు చేయనున్న  VM Home, LB Nagar హాస్పిటల్స్ మీద సమీక్ష జరిపారు. EHS/JHS స్కీం ప్రగతి, విస్తరణ మీద సంబంధిత సీఈఓ లు డాక్టర్ మనోహర్, డాక్టర్ పద్మ ల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. మరిన్ని వెల్నెస్ కేంద్రాలను త్వరలో ప్రారంభించాలని సూచించారు.

 

ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ,

వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.