మార్చ్ లోగా 20 వేల గ్రామాలకు ఇంటర్నెట్…

ఢిల్లీ, ప్రతినిధి :  ఈ మార్చ్ లోగా దేశవ్యాప్తంగా దాదాపు 20 వేల గ్రామాలకు ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించేందుకు డిపార్టుమెంట్ అఫ్ టెలికాం(డాట్) ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఆప్టిక్ ఫైబర్ తో కనెక్టివిటీ ఇవ్వాలనని డిసైడ్ అయింది. ఈ ప్రోగ్రాంని సోమవారం కేరళలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించనున్నారు. కేరళలో మొదలుపెట్టి కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ‘నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్’ (NOFN) పథకం కింద ఈ పనులు చేస్తున్నామని, 2016 లోగా దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ కల్పిస్తామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని డాట్ అధికారులు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.