హ‌రిత‌హారం, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొన్న వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి

తెలంగాణ‌కు ప‌చ్చ‌ల హారం

ప్ర‌జా ఉద్య‌మంగా హ‌రిత హారం

స‌మ‌గ్ర ప్ర‌గ‌తికి సిఎం ప‌ట్టం

హ‌రిత‌హారం, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి

ప్ర‌తి ఒక్క‌రూ మొక్కలు నాట‌డం ద్వారా తెలంగాణ‌కు ఆకు ప‌చ్చ‌ల హారం తొడుగుదామ‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. మాన‌వ మ‌నుగ‌డ‌కు మొక్కే దిక్క‌ని, మొక్కలు నాట‌డాన్ని ప్ర‌జా ఉద్య‌మంలా నిర్వ‌హించాల‌న్నారు. సిఎం కెసిఆర్ అభివృద్ధితోపాటు ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచే అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టార‌ని తెలిపారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఉరుకొండ మండ‌లం మాదారం గ్రామంలో నూత‌నంగా నిర్మించిన గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాన్ని మంత్రి ప్రారంభించారు. అనంత‌రం సిసి రోడ్ల ప‌నుల‌ను ప్రారంభించారు. గ్రామంలో నిర్వ‌హించిన హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో మొక్క‌లు నాటారు. త‌ర్వాత జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి మాట్లాడారు. గ‌తంలో పాల‌కులు అభివృద్ధిని ప‌క్ష‌పాతంగా, ఏక‌ప‌క్షంగా, ఒక పార్శ్వంలోనే చూశార‌న్నారు. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత సీఎం కెసిఆర్ తెలంగాణ స‌మ‌గ్ర అభివృద్ధితోపాటు మాన‌వ జీవ‌న ప్ర‌మాణాలు పెంచే అన్ని ర‌కాల చ‌ర్య‌లు చేప‌ట్టార‌న్నారు. ఇందుకు తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఇంటింటికీ మంచినీటి కోసం మిష‌న్ భ‌గీర‌థ‌, సాగునీటి కోసం సంప్ర‌దాయ చెరువుల పున‌రుద్ధ‌ర‌ణకు మిష‌న్ కాక‌తీయ, బంగారు పంట‌ల‌తో స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు ప్రాజెక్టులు, పెన్ష‌న్ల నుంచి క‌ళ్యాణ ల‌క్ష్మీ దాకా సంక్షేమ కార్య‌క్ర‌మాలు, రోడ్లు,ఐటీ, విద్యా, ఉపాధి, వైద్యం ఇలా అనేక కార్య‌క్ర‌మాల ద్వారా తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేసే దిశ‌గా ప‌ని చేస్తున్నార‌న్నారు. ఇక అర‌ణ్యాల‌ను వ‌దిలి, జ‌నారణ్యాల బాట ప‌ట్టిన కోతులు వాప‌స్ పోవాలె. వ‌ర్షాలు వాప‌స్ రావాలె అంటూ మొక్క‌లు నాటే హ‌రిత హారం కార్య‌క్ర‌మం ఎంతో ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ద‌న్నారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల ప్ర‌కారం 33శాతం ఉండాల్సిన అడ‌వులు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ వంటి జిల్లాల్లో 16శాతానికి ప‌డిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మొక్క‌లు న‌ర‌క‌డ‌మే త‌ప్ప పెంచ‌డం ప్ర‌జ‌లు మ‌ర‌వ‌డంతో రుతుక్ర‌మం దెబ్బ‌తింద‌న్నారు. అందుకే స‌కాలంలో వ‌ర్షాలు లేక క‌రువు, కాట‌కాలు వ‌స్తున్నాయ‌న్నారు. అతివృష్టి, అనావృష్టిల‌తో వాతావ‌ర‌ణ స‌మతౌల్యం దెబ్బ‌తింద‌న్నారు. వీటి నుంచి విముక్తం చేయ‌డానికే సిఎం హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని తీసుకున్నార‌ని మంత్రి చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ ఉద్య‌మంలా మొక్క‌లు నాటాల‌ని, మాన‌వ మ‌నుగ‌డ‌కు మొక్కే దిక్క‌న్నారు. మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం ప్ర‌జా ఉద్య‌మంలా సాగాల‌ని, వాటిని కాపాడ‌టానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అంతకుముందు మిడ్జిల్ మండ‌లం బోయిన్‌ప‌ల్లి గ్రామంలో ఈ మ‌ధ్యే మృతి చెందిన కళాకారుడు అంజ‌య్య కుటుంబాన్ని మంత్రి ల‌క్ష్మారెడ్డి ప‌రామ‌ర్శించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయ‌న మృతి తీరని లోటు అన్న మంత్రి, అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రి లక్ష్మారెడ్డితోపాటు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

laxmareddy 1     laxmareddy 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *