హ్యాపీ బర్త్ డే బాసూ..!

నలుగురికి నచ్చే దారిలో నడవడం ఆయనకు నచ్చదు.. అందుకే కొత్త దారిలో దూసుకెళ్తున్నాడు.. విజయం సాధిస్తున్నాడు.. పొలిటికల్ ఫ్యాక్టరీ చీఫ్ ఎడిటర్ గా, సీఈవోగా పట్టుదలతో ఓ వెబ్ సైట్ ను ప్రారంభించినప్పుడు ‘ఆ మామూలేలా.. ’ అని నిరుత్సాహ పరిచిన వారెందరో.. కానీ నేడు పొలిటికల్ పంచ్ స్టోరీలతో వేల మంది ఫేస్ బుక్, ట్విట్టర్ షేర్లతో సైట్ రేంజ్ ను అమాంతం పెంచేశారు. ఇందంతా ఒక్క ఏడాదిలోనే జరిగింది. మా బాసు బర్త్ డే .. మా పొలిటికల్ ఫ్యాక్టరీ బర్త్ డే ఒక్కటే.. తన సొంత బిడ్డలా చూసుకున్నాడు కాబట్టే .. పొలిటికల్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉంది.

యాదృశ్చికమో కాదో తెలియదు కానీ.. మా బాసు అయిలు రమేశ్.. మా సైట్ బర్త్ డేలో ఏప్రిల్ 13నే కలిసి వచ్చాయి. సామాన్య జర్నలిస్టుగా మొదలైన అయిలు రమేశ్ ప్రస్థానం ఇప్పుడు శిఖరాగ్రాన చేరింది. ఆయన ఎంచుకున్న మార్గం .. ధైర్యంగా ముందడుగేసిన చొరవ ఎంతో మందికి ఉపాధిని చూపించింది. అందరూ పత్రికలకు కనెక్ట్ అయిన వేళ.. సొంతంగా వెబ్ సైట్ ను ప్రారంభించి దుమ్ము రేపారు. అలాగే ఇంటర్ నెట్ విస్తృతమైన వేళ పొలిటికల్ ఫ్యాక్టరీ చానల్ ప్రారంభించి విజయవంతం అయ్యారు. లక్కుతో పాటు కష్టపడితే అన్నీ విజయాలన్నట్టు .. ఒక్కో అడుగు విజయం వైపే పడింది. ఇంత పెద్ద వెబ్ సైట్ ను ప్రారంభించిన సంవత్సర కాలంలోనే ఎక్కడికో తీసుకెళ్లిన మా బాసు అయిలు రమేశ్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని.. మరింత ముందుకెళ్లాలని ఆశిస్తూ..

——————— @ Political Factory Team@

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *