
పొలిటికల్ ఫ్యాక్టరీ.. అప్పుడప్పుడే పురుడుపోసుకుంటున్న ఆన్ లైన్ మీడియా అవకాశాలను ముందే పసిగట్టి పురుడుపోసిన పొలిటికల్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఆన్ లైన్ మీడియాలో ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగింది. ఈ ఎదగడంలో ఎంతో కృషి చేసిన చీఫ్ ఎడిటర్ కం సీఈవో అయిలు రమేశ్ గారి కృషి ఇందులో వెలకట్టలేనిది.. జర్నలిజమే శ్వాసగా భావించి అంచలంచెలుగా పొలిటికల్ ఫ్యాక్టరీని ప్రజలకు చేరువ చేసిన రమేశ్ గారు ఇప్పుడు దానికో స్థాయిని తెచ్చిపెట్టారు.
పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానాళ్లు దూసుకెళ్తున్న ఈ సమయంలో ఆన్ లైన్ మీడియాకు భవిష్యత్ ఉంటుందని గ్రహించి ఎంతో ముందు చూపుతో.. పలువురు సీనియర్ జర్నలిస్టులను చేర్చుకొని సొంతంగా ఆయన పెట్టిన ఈ సైట్ ఇప్పుడు దుమ్ము రేపే కథనాలతో.. బాధితుల కష్టాలు, కడగండ్లను పాలకులకు తెలియజెప్పుతూ ధైర్యంగా వార్తలు రాస్తూ ముందుకెళ్తోంది. దీని ప్రతి అడుగులో, విజయంలో ఈ సైట్ సీఈవో చీఫ్ ఎడిటర్ అయిలు రమేశ్ కష్టం ఉంది.. బుధవారం (13-04-2016) ఆయన పుట్టిన రోజు సందర్భంగా పొలిటికల్ ఫ్యాక్టరీ తరఫున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.. ఆయన జర్నీ ఇలాగే విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తూ..
బాస్ కు ప్రేమతో..
-పొలిటికల్ ఫ్యాక్టరీ టీం..