హ్యండులూమ్ అండ్ టెక్స్ టైల్స్ శాఖపైన మంత్రి కెటి రామారావు సమీక్షా సమావేశం

హ్యండులూమ్ అండ్ టెక్స్ టైల్స్ శాఖపైన మంత్రి కెటి రామారావు సమీక్షా సమావేశం

 

హ్యండులూమ్ అండ్ టెక్స్ టైల్స్ శాఖపైన మంత్రి కెటి రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమాన్ని, శాఖ చేపట్టిన పలు కార్యక్రమాల మీద మంత్రి  సమీక్షించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టెక్స్ టైల్స్ శాఖాధికారులు పాల్గోన్నారు. ఈ నెల 16 నాటికి అన్నీ చీరలు జిల్లా కేంద్రాలకు చేరుతాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. వచ్చే 17,18,19 తేదీల్లో చీరల పంపీణీ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమం ద్వారా ఒక వైపు నేతన్నలకు ఉపాధితోపాటు, పండగ సందర్భంగా అడపడుచులకు సంతోషం పంచినట్టు అవుతుందన్నారు. ఈ చీరల పంపీణీలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేయాలన్నారు.

ప్రభుత్వం టెక్స్ టైల్ శాఖకు గతంలో ఎన్నడు లేనంత సహాకారం ఇస్తుందని తెలిపారు. ఈసారి పెద్ద ఏత్తున బడ్జెట్ కేటాయింపులతో పాటు పక్కా ప్రణాళికలతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నేతన్నల కోసం పెద్ద ఏత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా కార్మికుల వ్యక్తిగత రుణాల మాఫీతోపాటు, నేతన్నకు చేయూత, యార్న్ సబ్సీడీ వంటి కార్యక్రమాలను చేపట్టామన్నారు.

ఇకపైన ప్రభుత్వం సేకరించే ప్రతి మీటర్ బట్ట రాష్ర్టం నుంచే సేకరిస్తామన్నారు. ఈ సారి కేవలం రెండు నెలల వ్యవధిలో కోటి అరు లక్షల అడపడుచులకు చీరలను అందిస్తున్నమన్నారు. రాష్ర్టంలోని నేతన్నల పూర్తి ఉత్పదక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు వార్షిక ప్రణాళికను తర్వలోనే ప్రభుత్వం ఉత్తర్వు రూపంలో ఇస్తామన్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచి రాష్ర్టంలోని నేతన్నలకు కనీసం సంవత్సరానికి 8 నెలల పాటు ప్రభుత్వం సేకరించే వస్ర్తాల ఉత్పత్తి పైన పనిచేసే అవకాశం వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న అర్డర్లతో నెలకు కనీసం 15 వేల రూపాయల వేతనం మూడు నెలలపాటు లభించిందన్నారు.  రంజాన్, క్రిష్టమస్, బతుకమ్మకు చీరలు, రాజీవ్ విద్యామిషన్ వస్ర్తాల సేకరణను వ్యవస్ధీకృతం చేయాలని అధికారులను అదేశించారు. వచ్చే ఏడాది నుంచి పక్కా ప్రణాళిక ప్రకారం ఈ వస్ర్తాల సేకరణ జరపాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇందుకోసం అడ్వాన్స్ ప్లానింగ్ చేయాలన్నారు. ప్రభుత్వంలో వస్ర్తాలను సేకరిస్తున్న విద్యశాఖ, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల శాఖాధిపతులతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

నేతన్నల కోసం చేపట్టిన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాన్నారు. నేతన్నకు చేయూత కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు వేంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే చేనేత మగ్గాలు, కార్మికుల సంపూర్ణ సమాచారం ఉన్నదని, దీంతోపాటు పవర్ లూమ్  కార్మికుల  సమాచార సేకరణను పూర్తి చేయాలన్నారు. ప్రతి వీవర్ లెక్క టెక్స్టైల్ శాఖ వద్ద ఉండాలని, ప్రతి పవర్లూమ్, చేనేత కార్మికుల సమాచారాన్ని డిజిటైజ్ చేయాలన్నారు. టెక్స్ టైల్ శాఖ చేపట్టనున్న యార్న్ సబ్సీడీ, రసాయానాలు, అద్దకాలు సబ్సీడీ వంటి కార్యక్రమాలు వేంటనే ప్రారంభం కావలని అధికారులను మంత్రి అదేశించారు. రాష్ర్టానికి వివిధ పథకాల కింద రావాల్సిన కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం డీల్లీలో ప్రత్యేక శ్రధ్ద వహించాలన్నారు. తాము ఇప్పటికే కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మతి ఇరానీ కలిసి ఈ మేరకు సహాకారం కోరామన్నారు. డిమాండ్  ఉన్న జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూంలను ఏర్పాటు చేస్తామన్నారు. డీల్లీలోని తెలంగాణ భవన్ లోనూ వేంటనే టెస్కో షోరూం ఏర్పాటు చేయాలని మంత్రి అదేశాలు జారీ చేశారు. ఇకపైన కేంద్రమంత్రులను కలిసే సందర్భంలో తెలంగాణ చేనత వస్ర్తాలు, గొల్కోండ కళాకృతులను అందిచాలని, ఈమేరకు డిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేయాలన్నారు.   

ktr 1     ktr 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *