
కరీంనగర్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్, కలెక్టర్ నివాసంలో శుక్రవారం హోళీ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని పోలీసులు హాజరై ర్యాలీగా డప్పు చప్పుళ్ల మధ్య ఎస్పీ నివాసానికి చేరుకుని మొదట ఎస్పీతో రంగులు చల్లుకొని హోళీ ఆడారు. అనంతరం కలెక్టర్ నివాసంలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, ఆమె భర్త అధికారులతో కలిసి హోళీ ఆడారు.