
మహనగరంలో ఉన్న హోర్గింగ్స్ పెను ప్రమాదంగా మారాయి. శుక్రువారం నాడు వీచిన హోరు గాలికి హోర్డింగ్ పోల్ విరిగిపడి జూబ్లీహిల్స్ లో ఎనిమిది కార్లు ధ్వంసం అయ్యాయి. సిటీలోనే మరోచోట భారీ హోర్డింగ్స్ కుప్పకూలిపోయాయి. మహనగరమంతా ఇలాంటి హోర్డింగులతో దర్శనమిస్తుంది. ఏ గాలివానకు ఎన్ని ప్రాణాల హోర్డింగ్స్ కూలతాయో తెలియని అయోమయ పరిస్ధితి ఇక్కడ దాపురించింది. గతంలో ఈ హోర్డింగ్స్ తొలగించాలని హైకోర్టు సీరియస్ నే హెచ్చరించింది. అయినా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ప్రభుత్వ యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకుంది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఈ హోర్డింగ్ లను తొలగించాలని నగర జీవులు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటే హోర్డింగ్స్ అన్ని ఒక్క రోజులో మాయమవ్వటం గ్యారంటి. లేదంటే నగర ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణం చెయ్యాల్సిందే. దటీజ్ గ్రేటర్ హైదరాబాద్.