హోం శాఖ బడ్జెట్   ప్రతిపాదనలు  సమీక్షించిన నాయిని నర్సింహరెడ్డి

Minister for Home & Labour Review on Home department Budget today at Secretariat

 

తెలంగాణ రాష్ట్ర హోం శాఖ 2017-18 బడ్జెట్  ప్రతిపాదనలపై రాష్ట్ర హోం ,  కార్మిక శాఖా మంత్రి  నాయిని నర్సింహరెడ్డి మంగళ వారం నాడు సచివాలయం లోని తన చాంబర్ లో  సమీక్షించారు.  రాష్ట్ర  డి.జి.పి.  ఆనురాగ్ శర్మ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది,  పోలీస్ కమీషనర్లు, యం. మహేందర్ రెడ్డి, (హైదరాబాద్), సందీప్ శాండిల్యా (సైబరాబాద్),  అడిషనల్ డి.జి.పి. లు  వి.కె. సింగ్, గోవింద్ సింగ్,  ఐ.జి.పి.లు, వి.సి సజ్జనార్ (ఇంటలిజెన్స్),  సంజయ్ కుమార్ జైన్, కె. శ్రీనివాస్ రెడ్డి,  రాచకొండ జాయింట్  పోలీస్ కమీషనర్ టి. శశిధర్ రెడ్డి  తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  హోం మంత్రి  మాట్లాడుతూ వచ్చే ఆర్థిక  సంవత్సరానికి బడ్జెట్  ప్రతిపాదనలను  అవసరం ఉన్న ఖాతాలను మాత్రమే కొనసాగించాలని  మూస పద్దతిలో  ప్రతి ఖాతా కు  కేటాయింపులు అడగవద్దని  సూచించారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొన్ని రోజులలో ముగుస్తున్నందన ఉపయోగించని బడ్జెట్ గల కారణాలను  పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.  గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ, ఉపయోగించని ఖాతాలు ఏమైన ఉన్నాయా అని  అధికారులను ప్రశ్నించారు.  బడ్జెట్  ప్రతిపాదనలపై పోలీస్  అధికారులు  తాము సిద్ధం చేసిన  పద్దులపై ఈ సందర్భంగా చర్చించారు.

HM review on Home Budget-2.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *