Breaking News

హోంమంత్రి రాజ్ నాథ్ ను కడిగేసిన సలీం..

rajnath-saleem-580x395

పార్లమెంటు సమావేశాల్లో అసహనం చర్చలో అధికార బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సీపీఎం సభ్యుడు సలీం కడిగేశాడు.. రాజ్ నాత్ ఔట్ లుక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ ను హిందుత్వ దేశంగా మార్చేస్తామని చెప్పారని.. మండిపడ్డారు. భారత్ హిందువులతో పాటు, ముస్లిం, క్రైస్తవులు, జైనులు, బుద్దులు ఇలా చాలామంది నివసిస్తున్నారని.. కేవలం హిందూత్వ దేశంగా మార్చి మతోకల్లోలాలు సృష్టిస్తారా అని మండిపడ్డారు.

దీనిపై రాజ్ నాత్ మండిపడ్డారు. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని.. సీపీఎం సభ్యుడి మాటలకు తన రాజకీయ జీవితంలోనే ఇప్పుడు చాలా బాధపడుతున్నానని చెప్పారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని.. లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కాగా ఔట్ లుక్ లో వచ్చిన మీ ఇంటర్వ్యూ ఆధారంగానే తాను మాట్లాడానని.. అవసరమైతే మ్యాగజైన్ పై కేసు పెట్టుకోవచ్చని సలీం చెప్పారు. దీనిపై రాజ్ నాత్ మండిపడ్డారు. అనని మాటలను పేపర్ ఆధారంగా ఎలా విమర్శిస్తారని మండిపడ్డారు.

కాగా అసహనంపై పార్లమెంటులో వాడీ వేడి చర్చ బీజేపీ ఇరుకునపెట్టింది. ప్రతిపక్షాలకు బూస్ట్ లా పనిచేసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *