
హైదరాబాద్ ఉస్మానియా వైద్యశాలలో మార్చురీని పరిశీలించిన వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
శవాలను భద్రపరిచే గదులు, కోల్డ్ స్టోరేజీ, ఫోరెన్సిక్ విభాగాలను పరిశీలించిన మంత్రి
అనంతరం ఉస్మానియా మార్చురీ వద్ద *మీడియాతో* మాట్లాడిన మంత్రి లక్ష్మారెడ్డి
రాష్ట్రంలో కొత్త మార్చురీ పాలసీ
అవసరమైతే విదేశీ పరిజ్ఞానాన్ని, అక్కడ ఉన్న మార్చురీ విధానాన్ని పరిశీలించి నూతన పాలసీని రూపొందిస్తాం మార్చురీ పాలసీని పూర్తిగా అమలు చేసేందుకు ఏర్పాట్లు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న అన్ని మార్చురీలను ఆధునీకరించేందుకు చర్యలు
పరిశీలనలో 24 గంటల పాటు మార్చురీల్లో మృత దేహాలకు శవ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు
ఇప్పటికే రాష్ట్రంలో 232 మృత దేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ల ఏర్పాటు జరిగింది
ప్రస్తుతం రాష్ట్రంలోని 113 హాస్పిటల్స్లో మార్చురీ సేవలు అందిస్తున్నాం
పార్థీవ దేహాలకు కూడా గౌరవ ప్రదమైన రీతిలో అవసరమైన సేవలు-నిల్వ చేయడం-పోస్టు మార్టం నిర్వహించడం-రవాణా చేయడం-తగు విధంగా ఖననం చేయడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నది
మాడర్న్ మార్చరీల ఏర్పాటు
ప్రస్తుతం రాష్ట్రంలో 50 మార్చురీ (పార్థీవ) వాహనాలు అందుబాటులో ఉన్నాయి. మరో 50 కొత్త వాహనాలను, పరమపద సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మార్చురీలలో ఇంకా మెరుగైన వసతుల ఏర్పాటు కోసం తగిన ప్రణాళికలు రూపొందించాం
మార్చురీలో అవసరమైన విధంగా పరికరాలు, ఫ్రీజర్లు, కొత్త గదులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం
తెలంగాణ రాష్ట్రంలో కొత్త మార్చురీ విధానాన్ని సీఎం గారి ఆమోదంతో త్వరలోనే అమలు చేస్తాం
గాంధీ మార్చురీని ఇప్పటికే ఆధునీకరించాం. ఉస్మానియా హాస్పిటల్లో మార్చురీని సెంట్రలైజ్డ్ ఎసీతో నిర్వహించాలని ఆదేశాలు
కొత్తగా ఫోరెన్సిక్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది
రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్లో మార్చురీల్లో అవసరమైన అన్ని చోట్ల ఫ్రీజర్ల ఏర్పాటు
పురాతన భవనాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి, కొత్త భవనాలను నిర్మించాలని టిఎస్ఎంఎస్ ఐడిసికి మంత్రి ఆదేశాలు
అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో పఫ్ రూమ్స్ ఏర్పాటు
మంత్రితోపాటు టిఎస్ఎంఎస్ఐడిసి చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్రెడ్డి, ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ఉస్మానియా ఫోరెన్సిక్ హెచ్ఓడి డాక్టర్ తకీయుద్దీన్ తదితరులు ఉన్నారు.