Breaking News

హైదరాబాద్ లో 4 1000పడకల ఆసుపత్రులు

1_apollo_hyderabad_pic

హైదరాబాద్ ప్రజల కోసం నగరానికి నాలుగు వైపులా 1000 పడకలతో అత్యాధునికి వైద్య ఆసుపత్రులను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ గత విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నిజమాబాద్, హైదరాబాద్-మహబూబ్ నగర్, హైదరాబాద్-విజయవాడల రోడ్ల వైపు ఈ నాలుగు ఆసుపత్రులను నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక వీటి కోసం స్థలాలు పరిశీలించేందుకు రెండురోజులుగా మంత్రి లక్ష్మారెడ్డి నగరంలో కలెక్టర్, తహసీల్దార్ , ఇతర అదికారులతో పర్యటిస్తున్నారు. స్థలాలను పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు. కేసీఆర్ హామీ మేరకు నాలుగు పక్కల స్థలాలు సేకరించి ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించి సంవత్సరం కల్లా నిర్మించి పేదలకు వైద్యసౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం త్వరితగతిన చర్యలు తీసుకుంటోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *