
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతీ విషయంలో గిల్లీ కజ్జాలు పెట్టుకుంటోందని.. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఇక్కడ గవర్నర్ పాలనే కొనసాగాలని స్పష్టం చేశారు.
ఏపీ అధికారులు, మంత్రులపై తెలంగాణ పెత్తనమేంటని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతీ విషయంలో తాము సంయమనంతో మెలుగుతున్న తెలంగాణ ప్రభుత్వం కావాలనే వివాదాలకు తెరతీస్తోందని.. భయపడేది లేదని హెచ్చరించారు.