హైదరాబాద్ లో విస్తృతంగా స్వచ్ఛ భారత్

Swachh Bharat @ Vidyanagar Hyderabad

హైదరాబాద్ : ఆదివారం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని సిటీ మొత్తం విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులందరూ హైదరాబాద్ లో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని  కాలనీలను శుభ్రం చేశారు.  మంత్రులు హరీష్, కడియం శ్రీహరి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్ రెడ్డి , పద్మారావు, మహమూద్ అలీలు వారివారికి కేటాయించిన కాలనీలకు వెళ్లి స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహించారు.  కాలనీల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి సూచనలు చేశారు.

ఉదయం 10.20 గంటలకు పార్శిగుట్ట బౌద్ధనగర్ డివిజన్ లో సీఎం కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్  కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరానికి చెందిన  బీజేపీ  ఎమ్మెల్యేలు లక్ష్మన్, కిషన్ రెడ్డి, ప్రభాకర్ లు అయా నియోజకవర్గాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *