హైదరాబాద్ లో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు

హైదరాబాద్ : హైదరాబాద్ జంట నగరాల పరిధిలో చైన్ స్నాచర్లు నిర్వహించారు. రాజేంద్రనగర్, లంగర్ హౌస్ లలో మహిళల మెడలోంచి దాదాపు 6 తులాల బంగారు గొలుసులు ఎత్తుకెళ్లారు..

కొద్దిరోజుల క్రితం చైన్ స్నాచర్లు దోపిడీలు చేయగా పోలీసులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక చైన్ స్నాచర్ పై కాల్పులు జరిపారు కూడా.. ఆ తరువాత కొద్దిరోజులు సైలెంట్ అయిన ఈ దోపిడీ దొంగలు మళ్లీ ఈ రెండు రోజులుగా రెచ్చిపోయారు. రాజేంద్రనగర్, లంగర్ హౌస్ లతో పాటు 5 చోట్ల మహిళల మెడలోంచి గొలుసులను లాక్కెళ్లారు..

కాగా దోపిడీ దొంగలు కర్ణాటక, మహారాష్ట్ర ల నుంచి ఇలా నెలకోసారి వచ్చి దోపిడీలకు దిగుతారని.. పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్టు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *