
హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారెడ్పల్లి, బేగంపేట, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపైకి నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.