హైదరాబాద్ లో పర్యటించిన శ్రీలంక జర్నలిస్టులు

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలో ముందంజలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో భారత పర్యటనలో హైదరాబాదుకి విచ్చేసిన శ్రీలంక జర్నలిస్టుల బృందంతో సి.ఎస్ సమావేశమయ్యారు.

 

400 ఏళ్ళకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ లో విభిన్న మతాలు, ప్రాంతాల ప్రజలు ఎంతో స్నేహ పూర్వక వాతావరణంలో జీవిస్తున్నారని, చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందని, భారతదేశంలో 5 అతిపెద్ద నగరమని సి.ఎస్ తెలిపారు. దేశంలో పోలీసింగ్ వ్యవస్ధ, చట్టాలు, శాంతిభద్రతల అంశాలు, నియామకం, శిక్షణ తదితర అంశాలను చర్చించారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంతో మంది యాత్రికులు శ్రీలంకను సందర్శించినారని, ఎంతో మంది కాంట్రాక్టర్లు వివిధ అభివృద్ధి పనుల నిర్మాణాలను చేపడుతున్నారని అన్నారు. సాహిత్య, వాణిజ్య, ఆర్ధిక పరంగా శ్రీలంకతో   సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని వారికి వివరించారు. శ్రీలంకకు చెందిన 17 మంది సీనియర్ ఎడిటర్లు, జర్నలిస్టుల బృందం భారత్ లో ఈనెల 17 నుండి 23 వరకు పర్యటిస్తున్నది. నెల 21 నుండి 24 వరకు హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్ మేషన్ సర్వీసెస్, ఎన్ ఆర్ ఎస్ ఏ, ఐఎస్ బి, గోల్కొండకోట, రామోజీఫిలింమ్ సిటీ లను సందర్శించనున్నారు. బృందంలో

Ms.Samangie Wettamuni,Dy.Editor-Daily News,

Mr.Suresh Perera,News Editor- Sunday Island

Ms.Kalani Kumarasinghe,Dy.Features Editor Daily Mirror

Ms. Vindya Amaranayake, Dy.Editor-Ceylon Today

Mr.Suranga Lakmal Bogahawatta,Sr. Journalist- Daily Divaina

Mr. Thissa Reweendra Perera,Dy.Editor-Sunday Rivira

Mrs.Ashoka Priyadarshani Hettiarachchi,Chief News Editor-ITN

Mr.Shehan Baranage,Ex.Director,News-Swarnavahini TV  ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *