హైదరాబాద్ లో నేటి నుంచి ఉచిత వైఫై

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ను స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దేందుకు వేస్తున్న ప్రణాళికల్లో ముందడుగు పడింది. హైదరాబాద్ లోని సచివాలయం, హుస్సేన్ సాగర్,  చుట్టు 10 కి.మీల మార్గంలో ఉచిత వైఫై సేవలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ సేవలను మంత్రి కేటీఆర్ సాయంత్రం ప్రారంభించనున్నారు.  అనంతరం ఈ సేవలను నగరం అంతటా విస్తరించనున్నారు.

హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల విస్తరించిన ట్యాంక్ బండ్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, మార్గంతో పాటు సచివాలయం పరిధిలో ఉచిత వైఫై అందుబాటులో ఉంటుంది. మొదటి అరగంట పాటు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ సంస్థ క్వాడ్ జెన్ సంస్థతో కలిసి అందిస్తున్న  ఈ వైఫై 2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ స్పీడుతో పనిచేస్తుంది. నెట్ వర్క్ పరిధిలో ఒకేసారి 1800 నుంచి 2500 వరకు మంది ఒకేసారి వాడుకునేలా టెక్నాలజీ రూపొందించారు. మొత్తానికి నేటి నుంచి వైఫై సేవలు ప్రారంభం కానుండడంతో టెక్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *