Breaking News

హైదరాబాద్ లో చదివినప్పుడు టీ అంటే ట్యాంక్ బండ్

00

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ-హబ్ లో సౌకర్యాలు ప్రపంచస్థాయిలో అద్భుతంగా ఉన్నాయని.. టీ హబ్ తో కలిసి మైక్రోసాఫ్ట్ పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల వెల్లడించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన సత్యనాదెళ్ల మంత్రి కేటీఆర్ తో కలిసి టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా టీ హబ్ లోని ఔత్సాహిక పరిశోధకులతో సత్యనాదెళ్లను మాట్లాడారు. ‘తాను హైదరాబాద్ లోనే చదువుకున్నానని.. ఇక్కడ అప్పట్లో టీ -హబ్ లాంటివి లేవన్నారు. అప్పట్లో టీ అంటే ట్యాంక్ బండ్ మాత్రమేనని చమత్కరించారు..

satya.jpg2

ఈ సందర్భంగా సత్యనాదెళ్ల మాట్లాడుతూ ‘ తాను మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టడానికి ముందు చాలా వైఫల్యాలు ఎదుర్కొన్నానని.. వైఫల్యాన్ని ఎదుర్కోవడం కాదు.. వైఫల్యం నుంచి ఏం నేర్చుకున్నావనేది ముఖ్యం.. నా విజయగాథలన్నీ నా వైఫల్యాల నుంచి నేర్చుకున్న గుణపాఠాలేనని’ ఆయన చెప్పారు.

satya.jpg3

తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ లో చేసిన ఏర్పాట్లు, కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని టీ హబ్ తో కలిసి మా యాక్సిలేటర్లు పాలుపంచుకుంటారని సత్య చెప్పారు.. మొత్తానికి సత్యనాదెళ్ల పర్యటనతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి టీ హబ్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *