హైదరాబాద్ లో కాల్పుల కలకలం

 హైదారాబాద్: మాస‌బ్‌ట్యాంక్ లోని శాంతిన‌గ‌ర్ లో కాల్పులు క‌ల‌క‌లం సృస్టించాయి. కేబీఎస్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ గా ప‌నిచేస్తున్న మ‌న్మ‌ధ‌ద‌లై పై గుర్తుతెలియని వ్య‌క్తి కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. ఒంటిగంట స‌మ‌యంలో మ‌న్మ‌ధ‌ద‌లై ఉంటున్న ప్లాట్ కు చేరుకున్న అగంత‌కుడు ఇంట్లోకి వెల్లిన కొద్ది సమయంలోనే రెండు రౌండ్ల కాల్పులు జ‌రిపాడు. కాల్పుల్లో బాదితుడికి గాయ‌లు కావ‌డంతో కేర్ హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. ఘ‌ట‌న స్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసున‌మోదు చేసుకుని.. నిందితుడి కోసం గాలిస్తున్నారు… హైదరాబాద్ మ‌స‌బ్‌ట్యాంక్ శాంతి న‌గ‌ర‌ల్‌లో ఒంటిగంట ప్రాంతం సాయి దుర్గా క‌నిముల్లి అపార్ట్‌మెంట్‌లో కాల్పులు జ‌రిగాయి. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాల‌యానికి కూత వేటు దూరంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. క్రిష్ణ భీమ సంమృద్ది బ్యాక్ లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న మ‌న్మ‌ధ‌దలై ల‌క్ష్యంగా గుర్తుతెల‌య‌ని వ్య‌క్తి కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. సుమార్ మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల 30 నిమిషాల పాత్రంలో మ‌న్మ‌ధ ద‌లై ఉంటున్న ప్లాట్ కు నిందితుడు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్ మెంట్ వాచ్ మెన్ శంక‌ర్ తో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి తాను మ‌ధాపూర్ బ్యాంక్ నుంచి వ‌చ్చిన్ట‌లు తెలిపాడు. ప్లాట్ లో ఉంటున్న బ్యాంక్ మేనేజర్ మ‌న్మ‌ధ ద‌లైని క‌ల‌వాల‌ని వాచ్ మెన్ తో వాకాబు చేశాడు. దీంతో బ్యాంక్ మేనేజర్లు త‌మ అపార్ట్ మెంట్ లో లేరని వాచ్ మెన్ శంక‌ర్ స‌మాధానం ఇచ్చాడు. దీంతో అక్క‌డే పార్క్ చేసి ఉన్న కారును చూపించిన అగంత‌కుడు తాను ఓఆర్ 02బీటీ2111 గ‌ల కారు ఒన‌ర్ ను క‌ల‌వాల‌ని కోర‌డంతో స‌ద‌రు వాచ్ మెన్ మ‌న్మ‌ధ ద‌లై ఫ్లాట్ కు ఫోన్ చేశాడు. స‌ద‌రు వ్య‌క్తిని పైకి పంపించాల‌ని కోర‌డంతో వాచ్ మెన్ మ‌న్మ‌ధ‌ద‌లై ఉంటున్న ఒక‌ట‌వ ఫ్లోర్ 101 ఫ్లాట్ కు తిసుకువెల్లాడు. దుండ‌గుడు వెళ్లిన కొద్ది స‌మ‌యంలొనే మ‌న్మ‌ధ ద‌లై పై కాల్పుల‌కు తెగ‌బ‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఐతే బాదితుడికి నిందితుడు ఎవ‌రో తెలియ‌దిని పోలీసులు స్ప‌ష్టం చేశారు. మొత్తం రెండు రౌండ్ల కాల్పులు జ‌రిగాయ‌ని గుర్తించారు పోలీసులు. మొద‌టి రౌండ్ గాళ్లోకి కాల్పులు జ‌రిపి.., అనంత‌రం రెండవ‌ రౌండ్ మ‌న్మ‌ధ దలై తొడబాగంలో కాల్చాడాని తెలిపారు పోలీసులు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఘ‌ట‌న స్థ‌లిలో త‌గిన అధారాలు సేకరించారు. ఐతే పోలీసులు సైతం ఘ‌ట‌న పై ప‌లు అనుమానాలు వ్య‌క్తి చేస్తున్నారు. రాబ‌రీ కోసం దాడి జ‌రిగిందా..? లేకా బ్యాంక్ లావాదేవాల వ్య‌హారంలో కాల్పులు జ‌రిగాయ అన్న కోణంలో ద‌ర్యాప్తు కొన‌సాతుంద‌ని పోలీసులు తెలిపారు. త్వ‌ర‌లోనే నిందితుడిని ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు 
manmad    manmad-dali

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.