హైదరాబాద్ లో ఉగ్రవాదుల కదలికలు

isis

ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నించిన తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులను టర్కీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు యువకులు అమెరికా, సౌదీలో ఉద్యోగం చేస్తున్నారు. అమెరికా నుంచి టర్కీ మీదుగా సిరియా వెళ్లేందుకు పయత్నిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. నిందితులల్లో గుప్రాన్‌ మొహియిద్దీన్‌ అనే వ్యక్తి వరంగల్‌ జిల్లాకు చెందినవాడు కాగా హమీద్‌ రహ్మద్‌ హైదరాబాద్‌కు చెందినవాడు. వీరుద్దరు ఆన్‌లైన్‌ లో వీడియోస్ చూసి ఐసీస్ పట్ల ఆకర్షితులైనట్టు దర్యాప్తులో తేలింది.  కొందరు యువకులు ఐసీస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు మరో సారి బయట పడింది. ఇటీవల తెలంగాణ కు చెందిన ఇద్దరు యువకులు… ఐసీస్ లో చేరేందుకు టర్కీ నుంచి సిరియా వెళ్తుండగా… ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మరోసారి హైదరాబాద్ లో ఉగ్రవాదుల కదలికలపై కలకలం రేపుతోంది. హైదరాబాద్ కు చెందిన రేహమాన్ అనే యువకుడు 2012 లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాడు. అలాగే వరంగల్ కు చెందిన మోహిద్దీన్ అనే యువకుడు కూడా 2012 లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఇతడు జాబ్ కోసం సౌదీ అరెబీయాకు వెళ్లాడు. వీరిద్దరు ఇంటర్ నెట్ ద్వారా పరిచయం అయ్యారు. అంతేకాదు ఈ ఇద్దరు యువకులు ఆన్ లైన్ లో ఐఎస్ ఐఎస్ వీడియోలు చూసి ఉగ్రవాదం పట్ల ఆకర్షితులైయారు. దీంతో సిరియాకు వెళ్లేందుకు ప్లాన్ వేశారు. అమెరికా నుంచి రేహమాన్ సౌదీ కి వచ్చాడు. సౌదీ నుంచి ఇద్దరు టర్కీ వెళ్లీ అక్కడ నుంచి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా…. టర్కీ పోలీసులు రేహమాన్ తోపాటు మోహిద్దీన్ లను అరెస్ట్ చేశారు. అక్కడ కోర్టు… ఇద్దరికి నాలుగు నెలలపాటు జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తి అయినా తర్వాత ఇద్దరిని ఈ ఏడాది అక్టోంబర్ లో తిరిగి ఇండియాకు పంపించేసింది టర్కీ ప్రభుత్వం. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. 2015,2016 లో సుమారు 24 మంది ఐసీస్ లో చేరేందుకు పయత్నిస్తుండగా… అప్పట్లో పోలీసులు అడ్డుకుని వారందరికి కౌన్సిల్ ఇచ్చి పంపించేశారు. ఈ ఘటనతో మరోసారి ఐసీస్ సానుభూతుపరులపై పోలీసులు నిఘా పెట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.