Breaking News

హైదరాబాద్ లో అర్ధరాత్రి భూకంపం

bukampam

హైదరాబాద్, ప్రతినిధి : హైదరాబాద్ లో అర్థరాత్రి స్వల్ప భూంకంపం సంభవించింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్ పుర, హైదర్ గూడ, కాళీ మందిర్, బుద్వేల్, బహదూర్ పుర, కాటేదాన్ తదితర ప్రాంతాల్లో పలు సెకన్లపాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు జనం ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. రాంబాగ్ లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. అర్ధరాత్రి అంతా జాగారం చేశారు.  రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

కాగా ఇవి తొలుత క్వారీ పేలుళ్లని అని జనం భావించినా భూకంపం అని తెలిసి వణికిపోయారు. జనం గుర్తించే స్థాయిలో భూకంపం వచ్చిందని ఈ ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేలుపై 1.8 గా నమోదైందని జాతీయయ భూ భౌతిక శాస్త్రవేత్తలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *