హైదరాబాద్ రూపురేఖలు మారుద్దాం

KCR-DICCI

-మే 16 నుంచి స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ
-నోవాటెల్ లో ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ క్యాంపెన్ ను హైదరాబాద్ లోని నోవాటెల్ లో బుధవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కూరగాయలు, మాంసం అమ్మేందుకు హైదరాబాద్ లో కాలనీకి ఒక మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

హైదరాబాద్ లో ఉన్న అభ్యుదయ వాదులు హైదరాబాద్ అభివృద్దికి తోడ్పడాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధి తో 5 లక్షల మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. హైదరాబాద్ ను 400ముక్కలు చేసి ఒక్కో ముక్కకు ఒక్కో బృందం ఏర్పాటు చేసి స్తానిక సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

నగరంలోని 2 లక్షల మంది పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని తెలిపారు.ఐడీహచ్ కాలనీ వాసుల కళ్లలో ఆనందం చూశామని.. నగరం మొత్తం పేదలు లేకుండా చేస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *