హైదరాబాద్ పై ప్రేమ అందుకోసమేనా.?

01kcr

ఒక్కసారిగా సీఎం కేసీఆర్ కు  హైదరాబాద్ పై ప్రేమ ఎందుకుపుట్టుకొచ్చింది.? సడన్ గా స్వచ్ఛ హైదరాబాద్ కు శ్రీకారం చుట్టి.. ఎందుకు ఇప్పుడే ప్రారంభించారు? ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ మొదలు పెట్టి పదినెలలైనా పట్టించుకోని కేసీఆర్ … ఒక్కసారిగా అదే పథకాన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ప్రారంభించడంపై అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దీని వెనుక పెద్ద తతంగమే ఉన్నదంటున్నారు హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యేలు.. రెండు రోజుల క్రితం స్వచ్ఛ హైదరాబాద్ లో తమను భాగస్వామ్యం చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం చాంబర్ ముందు బైటాయించారు.  కేసీఆర్ ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు ధ్వజమెత్తారు. అయితే కేసీఆర్ దూకుడు వెనుక ఉన్నది త్వరలో జరుగబోయే  ‘హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు’. అందుకే ఆయన ఈ హడావుడి చేస్తున్నారు.

కాగా  ఈ స్వచ్ఛ హైదరాబాద్ లో పాల్గొనాల్సిందిగా ఈ మధ్య ఢిల్లీ వెళ్లి కేసీఆర్ మోడీని ఆహ్వానించారు. కానీ ఆయన రావడానికి ఇష్టపడలేదు. హైదరాబాద్ బీజేపీ నేతలు దీనిపై మోడీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలవడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారని.. ప్రధాని రావద్దంటూ మోడీ కి విన్నవించారట.. దీంతో ఆయన కేసీఆర్ మాయలో పడకుండా స్వచ్ఛ హైదరాబాద్ కు రాలేదు. దీంతో కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ప్రారంభించారు.

మొత్తానికి సీఎం కేసీఆర్ ఏదీ చేసినా అందులో ఏదో ఒక పరమార్థం ఉంటుందని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *