హైదరాబాద్ పర్యటనలో వెస్ట్ బెంగాల్ కర్సియాంగ్ ఫారెస్ట్ అకాడమీ నుంచి ఫారెస్ట్ రేంజ్ అధికారులు

హైదరాబాద్ పర్యటనలో వెస్ట్ బెంగాల్ కర్సియాంగ్ ఫారెస్ట్ అకాడమీ నుంచి  38 మంది ట్రైనీ
FRO ( ఫారెస్ట్ రేంజ్ అధికారులు)
అరణ్య భవన్, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సందర్శన
అటవీ రక్షణలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సాంకేతికత పై అధ్యయనం

14 మంది మహిళల అభ్యర్ధులతో  పాటు 38 మంది ట్రైనీ అటవీ క్షేత్రాదికారులు ( FRO) కర్సియాంగ్ వెస్ట్ బెంగాల్ శిక్షణ కళాశాల నుండి రెండు రోజుల పర్యటనకై తెలంగాణా లో తెలంగాణా రాష్ట్ర అటవీ అకాడమీ కి చేరుకున్నట్టుగా సంచాలకులు మరియు అదనపు ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి డా. కోట తిరుపతయ్య గారు  తెలిపారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టత్మాకంగా భావిస్తున్న తెలంగాణకు హరిత హారం లో భాగంగా ANR మరియు AR ప్లాంటేషన్లు ను మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లా చూపించినట్లు సంచాలకులు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర అటవీ శాఖ లోని ప్రతిష్టాత్మక  మైన GIS విభాగాన్ని శిక్షణర్దులకు చూపించి వారి  శిక్షణ లో వివిధ విషయాలపై సుదిర్ఘమైన చర్చ జరిపినట్లు డా. తిరుపతయ్య తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన శిక్షణర్దుల్లో   గుజరాతి మరియు మహారాష్ట్ర కు చెందిన వారు కూడా ఉన్నారు.  కర్సీయంగ్ ప్రిన్సిపాల్  శ్రీ. వాంగ్డుప్ భూటియా  IFS ట్రైనీ ల వెంట పర్యటన లో పాల్గొన్నారు.  ఆ తర్వాత అరణ్య భవన్లో పర్యటించి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. అదనపు అటవీ సంరక్షానధికారి రఘువీర్ .. అటవీ ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమాలు వివరించారు..  హరితహారంలో నాటిన మొక్కలు, రక్షణా పద్ధతులు వివరించారు. వన్య ప్రాణి రక్షణ, వేసవిలో చర్యలపై తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసర్వే, అటవీ భూముల రక్షణ, సరిహద్దులగుర్తింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడకంపై సమావేశంలో అధికారులు వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *