హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ లో వాహనాన్ని జెండా ఊపి ప్రారభోత్సవం చేసిన మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి.

ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలోని డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ డెంటల్ హాస్పిటల్ ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి.

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ లో వాహనాన్ని జెండా ఊపి ప్రారభోత్సవం చేసిన మంత్రి

వాహనం లోపలి సదుపాయలను పరిశీలించిన మంత్రి

డెంటల్ కాలేజీ విద్యార్థుల పళ్ళను పరీక్షించిన మంత్రి

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి

సామాజిక డెంటల్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ మొబైల్ డెంటల్ హాస్పిటల్ వాహనాన్ని ప్రారంభిస్తున్నాం.  మారుమూల గ్రామాలకు ఈ వాహనాన్ని పంపి డెంటల్ శిబిరాలు నిర్వహిస్తాం. వాహనంలో రెండు డెంటల్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.ఏసీ సదుపాయం ఇన్ బిల్ట్ గా ఉంది. డెంటల్ సంబంధ సమస్యలను పరీక్షించి, అవసరమైతే x ray తీసి, తగు చికిత్స అందించే ఏర్పాట్లు అందులో ఉన్నాయి. ఇద్దరు డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు, మందులు వంటివి వాహనంలోనే ఉంటాయి. మారుమూల గ్రామాల్లో ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

చాలామంది గ్రామీణులు ఆరోగ్య సమస్యలు విషమించే దాకా పట్టించుకోవడం లేదు. దంత సమస్యలు కూడా ఒక్కోసారి చాలా తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తాయి. ఈ వాహనం ద్వారా ప్రజల్లో దంత సమస్యల మీద అవగాహన కల్పిస్తాం. గతంలో కాన్సర్ స్క్రీనింగ్ ని గ్రామాల్లో నిర్వహిస్తే అనేక మందికి అ లక్షణాలు బయట పడ్డాయి. అలాగే ఈ వాహనం ద్వారా పరీక్షలు గ్రామాలకు వెళ్లి చేయిస్తాం. వైద్యాన్ని మారు మూల గ్రామాలకే కాదు, సామాన్య ప్రజల ముంగిళ్ళ కు తీసుకెళుతున్నాం.

గతంలో దంత సంబంధ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. గడిచిన 59 ఏళ్లుగా డెంటల్ హాస్పిటల్ కి వాహనం దిక్కు లేదు. ఈ మధ్యే వైద్య విద్యార్థుల కోసం బస్సులను అందచేశాం. డెంటల్ విద్యార్థులకు కూడా బస్సులు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విదంగా మొబైల్ వాహనాలను, బైక్ అంబులెన్స్ లను, రెక్కల వాహనాలను, టీకా బండి లను ప్రారంభించాం. ఇవన్నీ ఆరోగ్య తెలంగాణలో భాగంగా ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ గారి  చాలవతో వైద్య శాఖ రూపు రేఖలు పూర్తిగా మార్చేశామ్. వచ్చే బడ్జెట్ లో కూడా వైద్య శాఖ కు మరిన్ని నిధులు ఇవ్వడానికి సీఎం గారు అంగీకరించారు.

dr laxma reddy

విద్యా, వైద్య రంగాల అభివృద్ధి మీద సీఎం దృష్టి సారించారు. వచ్చే బడ్జెట్ లో వైద్య రంగ ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిధుల అంచనా వేయమని అధికారులను అదేశించాం.

సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

బాగా పని చేస్తున్న వైద్య సిబ్బంది, అధికారులకు అభినందనలు

ఈ కార్యక్రమంలో డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *