హైదరాబాద్ ను ఓడించిన మాయాంక్

-సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ ఆఖరి బంతికి విజయం

హైదరాబాద్ : ఐపీఎల్ లో మరోసారి హైదరాబాద్ కు అదృష్టం కలిసిరాలేదు..  చివరి ఓవర్ లో ఓడిపోయింది.. మాయాంక్ అగర్వాల్ సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ కర్ణ శర్మ కొట్టిన సిక్స్ ను అద్భుతంగా ఆపడం.. సన్ రైజర్స్ ఓటమికి కారణమైంది. ఆ బంతి సిక్స్ పోయిఉంటే హైదరాబాద్ గెలిచి ఉండేది. కానీ మయాంక్ సిక్స్ ను గాల్లోకి ఎగిరి ఆపడం మ్యాచ్ ను మలుపుతిప్పింది.

మొదట ఢిల్లీ డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. శ్రేయాస్ 60, డుమిని 54 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ బొపారా 41, వార్నర్ 28, చివర్లో కర్ణ శర్మ 19 పరుగులు చేశారు. చివరి రెండు బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన తరుణంలో కర్ణ శర్మ సిక్స్ కొట్టగా మయాంక్ దాన్ని ఆపి ఢిల్లీని గెలిపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *