Breaking News

హైదరాబాద్ నుమాయిష్ లో తెలంగాణ అటవీ శాఖ స్టాల్ ను ప్రారంభించిన అటవీ సంరక్షణ అధికారి పీ.కె.ఝా

హైదరాబాద్ నుమాయిష్ లో తెలంగాణ అటవీ శాఖ స్టాల్ ను ప్రారంభించిన అటవీ సంరక్షణ అధికారి పీ.కె.ఝా

*ఆరోగ్య తెలంగాణ, అభివృద్ది తెలంగాణలో అటవీ శాఖ భాగస్వామ్యం

*తల్లి లాంటి ప్రకృతిని కాపాడితే, అది మనను రక్షిస్తుంది నినాదంతో ప్రదర్శన

*పిల్లలకు ఆటవిడుపు, పెద్దలకు పర్యావరణ సమాచారంతో ఎగ్జిబిషన్ లో అటవీ శాఖ స్టాల్

జనవరి నెల అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్.. అదే నుమాయిష్, ప్రతీ యేటా లాగానే ఈయేడు కూడా ఎగ్జిబిషన్ మొదలై పెద్ద ఎత్తున సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ నుమాయిష్ లో స్టాల్ ను  ప్రారంభించింది.  ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కె.ఝా ఇతర అధికారులతో కలిసి ప్రదర్శనను ప్రారంభించారు. పెద్దలకు పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి ప్రాధాన్యతను గుర్తుచేయటం, పిల్లలకు అటవీ జంతువులపై అవగాహన కలిగించేలా ఈ సారి అటవీ శాఖ స్టాల్ ను తీర్చిదిద్దారు. గత కొన్నేళ్లుగా ఆటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల సమస్త సమాచారాన్ని ఈ ప్రదర్శనలో పొందుపర్చారు.  తెలంగాణ నయగారా అని పేరొందిన బొగత జలపాతంతో పాటు, కుంటాల జలపాతాలను ప్రవేశ ద్వారంపై అంత్యంత ఆకర్షణీయంగా అటవీ శాఖ తీర్చిదిద్దింది.

pk zue 1 new

తెలంగాణకు హరితహారం, రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్, ఔషధ మొక్కల ప్రాధాన్యత, తెలంగాణలో ఎకో టూరిజం స్పాట్లు వాటి వివరాలు, పట్టణ ప్రాంతాల కోసం అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు, అడవులు, జంతుజాలం రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఈ యేడాదిని అగ్ని ప్రమాదాలు లేని అడవుల సంవత్సరంగా ప్రకటించడం వెనుక ప్రాధాన్యత ఇలా అటవీ శాఖ తరుపున అమలు చేస్తున్న కార్యక్రమాల సమాహారాన్ని ఎగ్జిబిషన్ వేదికగా ప్రదర్శిస్తోంది. పెద్దల కోసం ఔషధ మొక్కల స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే అటవీ శాఖ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు మంచి నినాదాన్ని(స్లోగన్) ఇచ్చిన వారికి బహుమతులను కూడా అటవీ శాఖ ప్రకటించింది. చిన్న పిల్లల కోసం బర్డ్స్ కాల్, మినీ జూను కూడా ఎగ్జిబిషన్ లోనే ఏర్పాటు చేశారు.

pk zue 2 new

అటవీ శాఖ ద్వారా చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు ఆరోగ్య , అభివృద్ది తెలంగాణలో భాగస్వామ్యం అవుతున్నాయని, ఇందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది గర్వపడుతున్నారని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కే.ఝా ఈ సందర్భంగా వెల్లడించారు.  అటవీ శాఖ స్టాల్ కూడా వీటన్నింటిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దామన్నారు. సంక్రాంతి సెలవులతో పాటు, మరో నెల రోజుల దాకా ఎగ్జిబిషన్ లో  ఉండే అటవీ శాఖ ప్రదర్శనను సందర్శించేలా ప్రతీ ఒక్కరూ ప్లాన్ చేసుకోవాలని అటవీ శాఖ అధికారులు కోరారు.

pk zue 3

ఈ ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో పిసీపీఎఫ్ పీ.కె.ఝా తో పాటు పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్) డాక్టర్ మనో రంజన్ భాంజా, పీసీసీఎఫ్ ( ఐ.టీ, పబ్లిసిటీ) పి.రఘువీర్, సీఎం ఓ ఎస్డీ ప్రియాంక వర్గీస్,  అదనపు అటవీ సంరక్షణ అధికారులు పృధ్వీ రాజ్, మునీంద్ర, లోకేష్ జైస్వాల్, ఆర్. శోభ, ఆర్.ఎం. డోబ్రియాల్, బాబూరావు, సునీల్ కుమార్ గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *