హైదరాబాద్ ది ముగిసిన ఆట..

ipl sunrisers

ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ గేమ్ ముగిసింది. మొదటి నుంచి మంచి ఆటతీరుతో నాకౌట్ రేసుకు దూసుకొచ్చిన సన్ రైజర్స్  చివరి క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ లో చేతులెత్తేసింది. ముంబైపై ఆదివారం జరిగిన కీలక మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సన్ రైజర్స్ క్వాలిఫైయింగ్ పోటీలకు అర్హత సాధించింది. అది గెలిస్తే ఫైనలే.. కానీ ఓడిపోయి ఐపీఎల్ నుంచి నిష్ర్కమించింది.

సన్ రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యంతో 20 ఓవర్లలో 113 కే చాపచుట్టేసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై కేవల 13.5 ఓవర్లలో 114 పరుగులు చేసి క్వాలిఫైయింగ్ రౌండ్ కు అర్హత సాధించింది. దీంతో ఐపీఎల్ లో సన్ రైజర్స్ కథ ముగిసినట్టైంది.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *