హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్

హైదరాబాద్ : వర్షాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం హైదరాబాద్ కు రానున్నారు. ఇక్కడి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన పది రోజుల పాటు హైదరాబాద్ లో గడపనున్నారు. జూలై 1న ఆయన తిరుమల వెళ్లి శ్రీవారికి మొక్కుల సమర్పించుకుంటారు. అనంతరం 3న యాదాద్రికి వెళ్లి పూజలు చేస్తారు. అక్కడే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

3న సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రచించిన ‘ఉనికి’ పుస్తకాన్ని హైదరాబాద్ లో ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరిస్తారు. రాష్ట్రపతి రాక సందర్భంగా హైదరాబాద్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి కోసం రోడ్లను బ్లాక్ చేశారు. వేరే రహదారుల గుండా ప్రయాణికులను మళ్లిస్తున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *