హైదరాబాద్‌లో నాంది చిత్రం షూటింగ్

సింహశ్రీ మిద్దె నటిస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘నాంది’. ‘నవ తెలంగాణ’ అనేది ఉపశీర్షిక. కొండోజు ఉపేంద్రాచారి నిర్మాత. ఉమశ్రీ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఖమ్మంలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సింహశ్రీ మాట్లాడుతూ ‘ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి దిశగా నడిపించడం కోసం కొంత మంది యువకులు ఏం చేశారన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. తెలంగాణ యువతకు మంచి సందేశాన్ని అందిస్తూనే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. దర్శకత్వంతో పాటు ఇందులో నేను హీరోగా నటిస్తున్నాను. తొలి షెడ్యూల్ పూర్తయింది. రాష్ట్రం విడిపోయినా రెండు రాష్ట్రాల తెలుగు వాళ్లు కలిసి అభివృద్ధి చెందాలని ఈ చిత్రంలో చెబుతున్నాం. చిత్రంలో చక్కటి ప్రేమకథ కూడా వుంటుంది’అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘మే నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించి 25 వరకు జరుపుతాం. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు. మణి, రాఘవ, సూర్యం, చేతన్, హోహన్ గౌడ్, శీతన్, ప్రియారెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఎస్.ఎన్.తిరు, సంగీతం:రవి కొరకాల,

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *