హైదరాబాదులో మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు

త్వరలోనే హైదరాబాదులో మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, రోడ్లు, భవనాల శాఖామాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  గురువారం, హైదరాబాదు లోని లలిత కళా తోరణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, విశిష్ట మహిళా పురస్కార ప్రధానోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణలో మహిళల అభివృద్దికి, సంక్షేమానికి వారి రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని అన్నారు.  మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిoచడానికి “WE- HUB” ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రాన్ని మహిళలకు సురక్షితమైన ఉమెన్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.  రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ద్వారా ఉచితంగా ఆంగ్ల విద్యను అందిస్తున్నామని అన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు ఒక పూట పౌష్టిక ఆహారాన్ని అందిస్తు, దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు.  “షీ” టీమ్స్ ఏర్పాటు ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని అన్నారు.

రాష్ట్ర హోo శాఖామాత్యులు శ్రీ నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మహిళల బద్రతకు భరోసాగా, మన రాష్ట్రంలో 200  షీ టీముల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవ్ టీజింగ్, మహిళలను వేధించడం వంటివి తగ్గటమే కాకుండా, పురుషులకు సరైన దారిలో పెట్టడానికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని తెలిపారు. 730 మహిళా కానిస్టేబుల్లను నియమించినట్లు తెలిపారు. ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించి, వారి ఆర్థిక స్వావలంబన సాధించేవిధంగా తల్లి దండ్రులు ప్రోత్సహించాలని అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, చట్ట సభలలో మహిళలకు ప్రాతినిధ్యం పెంచడానికి కేంద్రం  మహిళా రిజర్వేషన్ల బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పటినుండి వివాహం అయ్యేవరకు బాధ్యత తీసుకుంటున్నదని అన్నారు.  అందుకే ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి, ఉచిత విద్య, కళ్యాణ లక్ష్మి తదితర పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. మిషన్ భగీరధ పథకం ద్వారా ఆడబిడ్డలు కష్టపడకుండా ఇంటింటికి త్రాగు నీటిని అందించనున్నామని తెల్పారు.  

అనంతరం 17 రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు పురస్కారాలను అందచేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక సారధి  శ్రీ రసమయి బాలకిషన్, రాష్ట్ర బి.సి. కమిషన్ అధ్యక్షులు శ్రీ బి.ఎస్. రాములు, తెలంగాణ మహిళా ఆర్థిక అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి గుండు సుధారాణి, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమతో పాటు వివిధ జిల్లాల జిల్లా పరిషత్ అధ్యక్షులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

resized_DSC_9359  resized_DSC_9347  resized_DSC_9368  resized_DSC_9379  resized_DSC_9392  resized_DSC_9420

Post source : world womens day celebrations in hyderabad

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.