
ప్రైవేటు ఆస్పత్రి కాసుల కోసం కక్కుర్తి పడి యువకుడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. 3 అంగుళాల హైట్ పెరుగుతావంటూ మోకాల్లు కట్ చేసి రాడ్ లు వేసింది. దీనికి సంవత్సరం పడుతుందట.. అంతదాకా యువకుడు బెడ్ పైనే రెస్ట్ తీసుకోవాలి.. నిఖిల్ రెడ్డి అనే 22 సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇప్పటికై 5.7 అంగుళాల మంచి హైట్ ఉన్నాడు. కానీ మరింత హైట్ కోసం హైదరాబాద్ లోని గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించాడు. ఆ ఆస్పత్రి వైద్యులు కనీసం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండానే ఆ యువకుడి కాళ్లను కట్ చేసి శస్త్రచికిత్స చేసింది.
కుమారుడు కనిపించకోపోయేసరికి పోలీసుల సహాయంతో తెలుసుకొని గ్లోబల్ ఆస్పత్రికి రాగా వారు ఆస్పత్రి నిర్వాకంపై మండిపడ్డారు. కుమారుడిని సంవత్సరంపాటు మంచానికే పరిమితం చేసిన వైద్యుల కాసుల కక్కుర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యవర్గాలనే విస్మయ పరిచిన ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ యువకుడి నిండు జీవితాన్ని బలితీసుకుంది.