హైకోర్టు ఒక్కరోజులో విడగొట్టచ్చు.. కానీ ‘నాయుడు’లు చేయరు

mqdefault

హైకోర్టు విభజనపై బుధవారం పార్లమెంటులో హాట్ హాట్ గా  చర్చ జరిగింది.. కొద్ది రోజులుగా దీనిపై పార్లమెంటులో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అవకాశం కల్పించారు స్పీకర్. దీంతో మైక్ అందుకున్న టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి హైకోర్టు విభజనలో కేంద్రం ఆడుతున్న మైండ్ గేమ్ ను కడిగిపారేశారు.. హైకోర్టును విభజించకుండా ఇద్దరు నాయుడులు అడ్డుపడుతున్నారని.. కేంద్రం తలుచుకుంటే ఒక్కరోజులో హైకోర్టును విడగొట్టవచ్చని స్పష్టం చేశారు. దీని వెనుక చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడుల కుట్ర ఉందని విమర్శించారు.

అనంతరం మాట్లాడిన ఎంపీ కవిత.. తెలంగాణ ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తామని చెప్పినా ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా హైకోర్టును విభజించట్లేదని మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *